loader

డ్రగ్స్ కేసులో విల్ స్మిత్ కొడుకు జాడెన్ స్మిత్‌ అరెస్ట్?!

హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ కొడుకు జాడెన్ స్మిత్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. తండ్రి విల్ స్మిత్‌తో కలిసి ‘ది పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్’, జాకీ ఛాన్‌తో కలిసి ‘ది కరాటే కిడ్’ వంటి సినిమాల్లో నటించిన జాడెన్, ప్రస్తుతం పారిస్‌లో ఉన్న జాడెన్ స్మిత్, నగర వీధుల్లో వింత ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. జాడెన్ స్మిత్ డ్రగ్స్ మత్తులో ఉండడం వల్లే ఇలా వింతగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తున్నారు నెటిజన్లు.. మరికొందరైతే జాడెన్ స్మిత్, డ్రగ్స్‌తో పోలీసులకు […]

గోవా సీఎంతో కమెడియన్ అలీ భేటీ

ప్రముఖ హాస్యనటుడు అలీ  గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు అలీ గోవాలో ఉన్న విషయం తెలుసుకున్న సీఎం సావంత్ స్వయంగా అతడిని ఆహ్వానించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. సీఎం అలీ సినీ ప్రస్థానాన్ని ప్రశంసిస్తూ మాట్లాడుతూ “1260 సినిమాల్లో నటించడం చాలా గొప్ప విషయం” అని కొనియాడారు. అలీ తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించారని పేర్కొన్నారు. వారిద్దరి భేటీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

రాజ్యసభ ఎంపీగా కమల్‌హాసన్ ప్రమాణస్వీకారం

ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీధి మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ తాజాగా రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. తమిళనాడు ప్రభుత్వ మద్దతుతో, ముఖ్యంగా డీఎంకే పార్టీ మద్దతుతో కమల్‌హాసన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రత్యేకంగా తమిళ భాషలో ఆయన ప్రమాణస్వీకారం చేయడం విశేషంగా నిలిచింది.

చంద్రబాబు, లోకేశ్ లకు కృతజ్ఞతలు : పవన్

“హరిహర వీరమల్లు” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ రాజకీయ భావోద్వేగాలపై కూడా స్పందించారు తన సినిమాకు టికెట్ ధరలు పెంచేందుకు అవకాశం కల్పించిన ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. సినిమా విజయం కోసం మద్దతుగా పోస్ట్ చేసిన నారా లోకేశ్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. “ఎక్కడికి వెళ్లినా అక్కడే పుట్టాను అంటాడు” అంటూ విమర్శించే వారిని బావిలో కప్పలతో పోల్చారు. ఆవిషయాన్ని ఎత్తి చూపుతూ, తన పేరులోనే గాలి ఉందని, కాబట్టి ఎక్కడైనా […]

వేదిక‌పై గురువు పాదాల‌కి న‌మ‌స్క‌రించి ఆయ‌న‌ని శాలువాతో స‌త్క‌రించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

మ‌రి కొద్ది నిమిషాల‌లో ప‌వ‌న్ క‌ళ్యాన్ న‌టించిన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా ప్రీమియ‌ర్ షోస్ జ‌రుపుకోనుంది. విశాఖపట్నంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ పవన్ అభిమానులకు ప్ర‌త్యేకంగా నిలిచింది. ఈ ఈవెంట్‌లో సినిమా యూనిట్‌తో పాటు రాజకీయ నాయకులు, పవన్ స‌న్నిహితులు కూడా హాజరయ్యారు. నటుడిగా తనను తీర్చిదిద్దిన గురువుకు సన్మానం చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ మానవీయతను, వినయాన్ని మరోసారి ప్రదర్శించారు. ఇక ఈవెంట్‌లో ఉత్త‌రాంధ్ర పాట‌లు కూడా పాడి అల‌రించారు ప‌వ‌న్. ఎంఎం కీరవాణిని కూడా […]

వీరమల్లుకు నిరసన సెగ.. పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు చించేసిన కన్నడిగులు

పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం విడుదల కానుండగా, కర్ణాటకలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు టైటిల్‌తో ప్రచారం చేయడంపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బళ్లారిలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను కన్నడ భాషాభిమానులు తొలగించారు. కన్నడలో కాకుండా తెలుగులో ప్రచారం చేయడంపై వారు అభ్యంతరం తెలుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సినిమాల కంటే రాజకీయాలకే ప్రాధాన్యం- చిట్ చాట్‌లో పవన్ కల్యాణ్

హరిహరవీరమల్లు సినిమాలో రాజకీయాలు ఉండవని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. సినిమానా, రాజకీయాలా అంటే నా ప్రయారిటీ రాజకీయాలకేనని స్పష్టం చేశారు. అయితే తన వల్ల నిర్మాత లు నష్టపోయారని.. నా సినిమాల ఆలస్యం వల్ల వారు బలైపోయారని అన్నారు. నైతిక బాధ్యత వహించి నేను వాటిని పూర్తి చేశాననని.. రెమ్యూనేషన్ గురించి ఆలోచన చేయలేదు… సినిమా పూర్తి చేయాలనే పని చేశాననన్నారు.

ఉస్తాద్ భగత్ సింగ్ లో రాశీ ఖన్నా ఎంట్రీ

ప‌వ‌ర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్.  సినిమా మేకర్స్ తమ సోషల్ మీడియాలో రాశీ ఖన్నా షూటింగ్‌లో జాయిన్ అయినట్లు ఒక పోస్ట్ పెట్టారు. ఈ సినిమాలో ఆమె ‘శ్లోక’ అనే కీలక పాత్రలో నటిస్తున్నారని, ఈ మూవీలో రాశీ ఖన్నా ‘శ్లోక’ పాత్రలో ఫోటోగ్రఫీ జర్నలిస్ట్‌గా కనిపించబోతున్నారు

పరాజయంలో ఉన్నప్పుడు త్రివిక్రమ్‌ నన్ను నిలబెట్టాడు.. పవన్‌ కళ్యాణ్‌

ఆ తర్వాత ఒక్క ఫ్లాప్‌ మూవీతో తాను స్ట్రక్ అయిపోయాను, ఏం చేయాలనే డైలామాలో ఉన్నప్పుడు త్రివిక్రమ్‌ నా జీవితంలోకి వచ్చాడు. నాకు `జల్సా` సినిమాని ఇచ్చాడు. ఎవరూ తనతో సినిమా చేయడానికి ముందుకు రాకపోయినప్పుడు త్రివిక్రమ్‌ వచ్చి నాతో సినిమా చేసి హిట్‌ ఇచ్చాడు. సక్సెస్‌ లో ఉన్నప్పుడు మన వెంట ఉండేవారుకాదు, పరాజయంలో, కష్టాల్లో ఉన్నప్పుడు మన వెంట నిలబడేవాడే నిజమైన ఫ్రెండ్‌. అలా నాకు దొరికిన గొప్ప స్నేహితుడు త్రివిక్రమ్‌ అని తెలిపారు […]

దూకుడు పెంచిన ఈడీ..సెలెబ్రెటీలకి నోటీసులు

బెట్టింగ్ యాప్‌లకి సంబంధించి మనీలాండరింగ్‌, హవాలా లావాదేవీల ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. బెట్టింగ్ యాప్ కేసులో సెలెబ్రెటీలు రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండకు ఈడీ నోటీసులు అంద‌జేయ‌డం జ‌రిగింది. ఈ నెల 23న రానా, 30న ప్రకాష్‌రాజ్ విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. అలానే వచ్చే నెల 6న విజయదేవరకొండ, 13న మంచులక్ష్మి విచారణకు రావాలని ఈడీ తెలిపింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON