loader

చెప్పు తెగుద్ది… మీ అమ్మ, చెల్లి అయితే ఇలా చేస్తారా?- యాంకర్ అనసూయ

ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనసూయ స్టేజీపై స్పీచ్ ఇస్తుండగా కొందరు యువకులు అసభ్యకర కామెంట్స్ చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె… ‘చెప్పు తెగుద్ది’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘మీ ఇంట్లో మీ అమ్మ, చెల్లి, భార్య, కుటుంబ సభ్యులను ఇలాగే కామెంట్స్ చేస్తే మీరు ఊరుకుంటారా? పెద్దవాళ్లకు మర్యాద ఇవ్వాలంటూ మీ ఇంట్లో మీకు నేర్పలేదా?’ అంటూ ఫైర్ అయ్యారు.

తెలుగు సినిమాలు సత్తా చాటాయి… మెగాస్టార్ చిరంజీవి

71వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌గా, ఏడు కేటగిరీల్లో తెలుగు సినిమాకు అవార్డులు వరించాయి మెగాస్టార్ చిరంజీవి త‌న సోష‌ల్ మీడియాలో జాతీయ అవార్డ్ గ్రహీతలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేశారు. “తెలుగు టాలెంట్, తెలుగు సినిమాలు ఈసారి పదికి పైగా విభాగాల్లో అవార్డులు గెలుచుకోవడం చూసి ఎంతో గర్వంగా ఉంది.. ” అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు చిరంజీవి.అలానే బాల‌య్య న‌టించిన భ‌గ‌వంత్ కేస‌రి చిత్ర బృందానికి ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలియజేశారు.

71వ జాతీయ సినీ అవార్డులు

32 ఏళ్ల తర్వాత మొట్టమొదటి నేషనల్ బెస్ట్ యాక్టర్ అందుకోబోతున్న షారుక్ ఖాన్.. ‘జవాన్’ మూవీలో నటనకి గాను జాతీయ ఉత్తమ నటుడిగా గుర్తింపు.. ‘10th Fail’ మూవీ నటుడు విక్రాంత్ మాస్సేతో కలిసి సంయుక్తంగా ఉత్తమ జాతీయ నటుడు అవార్డు అందుకోబోతున్న షారుక్ ఖాన్.. ‘మిసెస్ ఛటర్జీ vs నార్వే’ చిత్రంలో నటనకి బాలీవుడ్ సీనియర్ నటి రాణీ ముఖర్జీకి జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కింది.

కల్పిక కేసులో మరో ట్విస్ట్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి

సినీనటి కల్పిక పేరు ఈమధ్యకాలంలో ఎక్కువగా వార్తలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కల్పిక తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తెకు మెంటల్ డిజార్డర్ ఉందని.. ఆమె వల్ల కుటుంబసభ్యులకు, ప్రజలకు ప్రమాదముందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే ఆమె రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిందని.. రిహాబిలిటేషన్ సెంటర్ లో చేర్పిస్తే అక్కడ ఉండకుండా తిరిగి వచ్చేసిందని తెలిపారు. ఇంట్లో తరచూ గొడవలు చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తుందని ఫిర్యాదులో తెలిపారు.

త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లని ఖండించిన విజ‌య్ సేతుప‌తి

కోలీవుడ్‌ టాప్ హీరోలలో ఒకరైన విజయ్ సేతుపతి, ‘ డాక్టర్ రమ్య మోహన్ అనే మ‌హిళ‌ తన సోషల్ మీడియా ఖాతాలో విజయ్ సేతుపతిపై “విమనైజర్”, “డ్రగ్ మానిప్యులేటర్ష‌ అని చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇష్యూపై విజ‌య్ సేతుప‌తి స్పందించారు. ఆ ఆరోప‌ణ‌లు ఏ మాత్రం నిజం కావు. అవి నా మీద ఏ మాత్రం ప్ర‌భావం చూప‌వు. అలాంటివి ఎప్ప‌టికీ జ‌ర‌గ‌వు అని, ఇప్ప‌టికే ఆమెపై సైబ‌ర్ క్రైమ్‌లో త‌న టీమ్ ఫిర్యాదు చేసింద‌ని […]

మిస్సెస్ ఇండియాగా విజయలక్ష్మి.. తెలంగాణ నుంచి ఏపీ మహిళ!

అన్నమయ్య జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. సంబేపల్లి మండలం మినుమరెడ్డి గారి పల్లికి చెందిన కవ్వం విజయలక్ష్మి మిస్సెస్ ఇండియాగా ప్రతిభ కనబరిచింది. 50 ఏళ్ల విజయలక్ష్మి చిత్తూరు జిల్లాలో HPCL డీలర్‌గా ఉంటుంది. 25 ఏళ్ల నుంచి 65 ఏళ్ల లోపు వయసు ఉన్న మహిళలకు నిర్వహించిన మిస్సెస్ ఇండియా కాంటెస్ట్ రెండు నెలలపాటు జరిగింది. 18 మంది గ్రాండ్ ఫినాలేలో పోటీ పడగా నాలుగు రౌండ్లలో ప్రతిభను కనబరిచి మిస్సెస్ ఇండియాగా విజయలక్షి కిరీటాన్ని […]

బెట్టింగ్ యాప్ కేసు.. ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన న‌టుడు ప్ర‌కాశ్ రాజ్

ప్ర‌ముఖ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ బెట్టింగ్ యాప్ కేసులో నేడు ఈడీ ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యాడు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని నటుడు ప్రకాశ్ రాజ్‌తో పాటు ప‌లువురు న‌టుల‌కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల మేరకు బుధవారం ప్రకాశ్ రాజ్ హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో ఉన్న‌ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.

ఆ ఈవెంట్ కు నా అనుమతి లేదు… నందమూరి బాలకృష్ణ

సోషల్ మీడియాలో తన పేరు అడ్డంపెట్టుకుని జరుగుతున్న ప్రచారాన్ని ప్రముఖ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఖండించారు. ‘‘బంగారు బాలయ్య – బసవతారకం ఈవెంట్’’ పేరుతో అశ్విన్ అట్లూరి అనే విరాళాలు సేకరిస్తున్నట్టుగా తెలిసిందని.. అయితే ఆ ఈవెంట్‌కు తన అనుమతి లేదని తెలిపారు. బసవతారకం ఆస్పత్రి ట్రస్టు బోర్డు నుంచి ఎటువంటి అధికారిక ఆమోదం లేదని చెప్పారు. ఈ రకమైన అనధికారిక, తప్పుదారి పట్టించే కార్యక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తన అభిమానులను, […]

ఆమిర్ ఖాన్ ఇంటికి 25 మంది ఐపీఎస్ ఆఫీసర్స్

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ఇంటికి దాదాపు 25 మంది ఐపీఎస్ అధికారులు ఒకేసారి రావడం చర్చనీయాంశమైంది. పోలీసులు బస్సు, వ్యాన్లలో బాంద్రాలోని ఆయన ఇంటికి వచ్చారు. దీనికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా… ప్రస్తుతం బ్యాచ్‌లోని ఐపీఎస్ ట్రైనీలు ఆమిర్ ఖాన్‌తో సమావేశం కావాలని కోరగా… వారికి ఆయన తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారని ఆమిర్ ఖాన్ టీం సభ్యుడు వెల్లడించారు. ఆమిర్ ఇంతకు ముందు కూడా చాలా ఏళ్లుగా అనేక ఐపీఎస్ […]

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇంట్లో బాంబ్ కలకలం!

సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్టుగా ఓ బెదిరింపు కాల్, తమిళనాడులో కలవరం క్రియేట్ చేసింది. చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్‌లోని నీలంగరైలో ఉన్న విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్టుగా ఓ గుర్తు తెలియని వ్యక్తులు, పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేశారు. దీంతో మూడు  బాంబ్ స్క్యాడ్  , స్నిఫర్ డాగ్.. విజయ్ ఇంట్లో సునిశితంగా పరిశీలించి, తనిఖీలు చేపట్టారు. అయితే ఇంట్లో ఎలాంటి పేలుడు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON