loader

అందుకే ట్రోలింగ్‌కి స్పందించను- చిరంజీవి

ఫీనిక్స్ ఫౌండేషన్‌ సహకారంతో బుధవారం జరిగిన రక్తదాన కార్యక్రమంలో చిరంజీవి రక్తదానం ప్రాధాన్యతపై మాట్లాడుతూ, తన బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు స్ఫూర్తినిచ్చిన జర్నలిస్ట్ కథను గుర్తు చేసుకున్నారు. మిమ్మల్ని చాలామంది సోషల్‌మీడియాలో ట్రోల్ చేస్తుంటారు కదా మీకేమీ అనిపించదా అని సన్నిహితులు నన్ను అడుగుతుంటారు. నేను చేసిన మంచి, నేను పొందుతోన్న అభిమానం, ప్రేమే నాకు రక్షణ కవచాలు. నేను తిరిగి మాట్లాడక్కర్లేదు. నేను చేసిన మంచే మాట్లాడుతుందని చెబుతుంటా.

కింగ్‌డమ్‌ చిత్రానికి తమిళనాడులో నిరసన సెగలు

విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘కింగ్‌డమ్‌’ తీవ్ర వివాదంలో చిక్కుకుంది. తమిళనాడులో ఈ సినిమాకు ఎదురుదెబ్బ తగిలింది.చిత్రంలో శ్రీలంక తమిళులను ప్రతినాయకులుగా చూపించారనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, తమిళుల ఆరాధ్య దేవుడైన మురుగన్ పేరును విలన్‌కి పెట్టడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నామ్ తమిళ్ కచ్చి (NTK) అనే తమిళ జాతీయవాద పార్టీ ఈ అంశంపై హోరెత్తిస్తోంది. మా అస్తిత్వాన్ని, చరిత్రను కించపరచే ప్రయత్నం. ఈ ఆరోపణల నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు […]

ఉపాసనకు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు

మెగా ఇంటి కోడలు.. రాం చరణ్ సతీమణికి తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ముఖ్యమంత్రి రేవంత్ తనకు అప్పగించిన బాధ్యతల పట్ల ఉపాసన సంతోషం వ్యక్తం చేసారు. సీఎం కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో క్రీడా రంగాన్ని అభివృద్ధి లక్ష్యంతో కాంగ్రెస్ సర్కార్ ‘స్పోర్ట్స్ పాలసీ 2025’ను తీసుకొచ్చిన రేవంత్ ప్రభుత్వం తాజాగా ‘స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ’ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు చైర్మన్‌గా సంజీవ్ గోయెంకాను నియమించింది. మెగా కోడలు ఉపాసన కామినేనిని […]

కార్మికుల బంద్ ఎఫెక్ట్.. ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్ అడ్డగింత

టాలీవుడ్ కార్మిక సంఘాలు వేతనాలు 30% పెంచాలన్న డిమాండ్‌తో నేటి నుండి సమ్మె ప్రారంభించాయి. ఫిలిం ఛాంబర్ అంగీకరించకపోవడంతో షూటింగులు నిలిచిపోయాయి. అయితే మైత్రి మూవీ మేకర్స్ మాత్రం పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్‌ను కొనసాగిస్తోంది. సీనియర్ ఆర్టిస్టుల డేట్స్ ఉండటంతో షూటింగ్ ఆపితే నష్టం కలుగుతుందని ముంబయి నుండి కార్మికులను తెప్పించి అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న యూనియన్ నేతలు అక్కడకు వెళ్లి షూటింగ్ ఆపే […]

ముదిరిన వివాదం, వేతనాలు పెంచడం కుదరదు..ఫిలిం ఛాంబర్

చిత్ర పరిశ్రమకి చెందిన ఫెడరేషన్ లోని 24 కార్మిక సంఘాలు ఈ బంద్ లో పాల్గొనబోతున్నాయి. ఆదివారం రోజు ఫిలిం ఛాంబర్ తో వర్కర్స్ ఫెడరేషన్ సభ్యులు చర్చలు జరిపారు. ఈ చర్చలు విఫలం కావడంతో సినిమా షూటింగ్స్ బంద్ కి పిలుపునిచ్చారు. బంద్ నిర్ణయంపై ఫిలిం ఛాంబర్ తాజాగా ఘాటుగా స్పందించింది. ర్మాతలు ఎవరూ కూడా ఫెడరేషన్ సభ్యులకు అనుకూలంగా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవద్దని, ఫిలిం ఛాంబర్ ఆదేశాలు మాత్రమే పాటించాలని లెటర్ రిలీజ్ చేశారు.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి.. తెలంగాణ సీఎ రేవంత్ రెడ్డిని ఆయన నివాసంకు వెళ్లి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ సీఎం కు.. చిరంజీవి ప్రత్యేకంగా బొకె ఇచ్చి విష్ చేశారు. సీఎం రేవంత్ కూడా.. చిరంజీవిని అంతే ఆప్యాయతతో పలకరించి.. బొకెతో పాటు, శాలువతో చిరును సన్మానించారు. ఇద్దరు కూడా చాలా సేపు పలు విషయాలపై మాట్లాడుకున్నట్లు తెలుస్తొంది. చిరంజీవి మర్యాదపూర్వకంగా సీఎంతో సమావేశమై మాట్లాడారంటూ.. తెలంగాణ సీఎంఓ కార్యాలయం ఈ భేటీకి సంబంధించిన వీడియోను ‘ఎక్స్‌’ ప్లాట్‌ఫారమ్‌లో […]

రేపటి నుంచి టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్!

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్, రేపటి నుంచి షూటింగ్స్‌ బంద్‌కి పిలుపునిచ్చింది. ఆగస్టు 4 నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్‌కి 30 శాతం వేతనాలు పెంచి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న ఫెడరేషన్, 30 శాతం పెంచి వేతనాలు ఇస్తామని నిర్మాత నుంచి రాతపూర్వకంగా ధృవకరణ లేఖ ఇచ్చిన వారి సినిమాలకు మాత్రమే పనిచేయబోతున్నట్టుగా ప్రకటించింది.. 30 శాతం వేతనాలు పెంచడమే కాకుండా పెంచిన వేతనాలను ఏ రోజుకి ఆ రోజు చెల్లించేలా ఒప్పందం కూడా […]

ఢీ కొరియోగ్రాఫర్ కృష్ణ అరెస్ట్- పోక్సో కేసు

డ్యాన్స్ షోలు, సినిమాల్లో కొరియోగ్రాఫర్‌గా పేరుతెచ్చుకున్న ఢీ కొరియోగ్రాఫర్ కృష్ణ మైనర్ బాలికపై అసభ్య ప్రవర్తనకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనపై పోక్సో (POCSO) కేసు నమోదు కాగా, గచ్చిబౌలి పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.  పోలీస్ స్టేషన్‌కి వచ్చిన బాలిక తల్లిదండ్రులు, కృష్ణ మాస్టర్ తన కుమార్తె పట్ల అనుచితంగా ప్రవర్తించాడని తీవ్ర ఆరోపణలు చేశారు.  కృష్ణ మాస్టర్ పైన గతంలోనూ అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పలు యువతులను మోసం చేశారన్న […]

తలైవా యాక్షన్ వేరే లెవల్

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ కనగరాజు తెరకెక్కిస్తోన్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున, కన్నడ నటుడు ఉపేంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు మేకర్స్.కూలీ సినిమా ఆగస్టు 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తాజాగా కూలి మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో కింగ్ నాగార్జున నెగిటివ్ […]

అభినందనలు తెలియచేసిన సీఎం చంద్రబాబు

నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ జాతీయ అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు. 71వ జాతీయ చలన చిత్ర అవార్డు విజేతలకు హృదయపూర్వక అభినందనలు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పురస్కారాలను అందుకున్న ప్రతి ఒక్కరికీ గర్వకారణమైన ఈ ఘనతకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ ఆయన ట్వీట్ చేశారు. ముఖ్యంగా భగవంత్ కేసరి చిత్ర బృందానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON