టాలీవుడ్ కార్మిక సంఘాలు వేతనాలు 30% పెంచాలన్న డిమాండ్‌తో నేటి నుండి సమ్మె ప్రారంభించాయి. ఫిలిం ఛాంబర్ అంగీకరించకపోవడంతో షూటింగులు నిలిచిపోయాయి. అయితే మైత్రి మూవీ మేకర్స్ మాత్రం పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్‌ను కొనసాగిస్తోంది. సీనియర్ ఆర్టిస్టుల డేట్స్ ఉండటంతో షూటింగ్ ఆపితే నష్టం కలుగుతుందని ముంబయి నుండి కార్మికులను తెప్పించి అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ చేస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న యూనియన్ నేతలు అక్కడకు వెళ్లి షూటింగ్ ఆపే ప్రయత్నం చేయడంతో వాగ్వాదం చోటు చేసుకుంది.

