loader

జన నాయగన్’కు మరోసారి చుక్కెదురు- మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు

దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’ మూవీకి చిక్కులు ఇప్పట్లో వీడేలా లేవు. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ మంజూరు చేయాలని ఇది వరకు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ మంగళవారం తోసిపుచ్చింది. దీంతో ఈ సినిమా విడుదల సంబధించిన సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.

కమిట్మెంట్‌కు నో చెబితే ఛాన్స్‌లు ఇవ్వరు.. చిరంజీవి కామెంట్స్‌పై చిన్మయి రియాక్షన్

సినీ పరిశ్రమలో ‘కాస్టింగ్ కౌచ్’ అనేది లేదని మెగాస్టార్ కామెంట్స్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. కాస్టింగ్ కౌచ్ లేదన్న చిరంజీవి వ్యాఖ్యలను విభేదించారు సింగర్ చిన్మయి. కాస్టింగ్ కౌచ్ అనేది అదుపులో లేని సమస్య. కమిట్మెంట్ కు నో చెబితే రోల్స్ ఇవ్వరు. చిరంజీవి జనరేషన్లో మహిళా ఆర్టిస్టులను గౌరవించేవారు. ఇక్కడ పని ఇచ్చినందుకు బదులుగా సె*క్స్ కోరుకుంటారు. అలాంటి పురుషుల ఆలోచనా ధోరణే పెద్ద సమస్య అంటూ ట్విట్ చేశారు చిన్మయి. ఇప్పుడు ఈ […]

రాజేందప్రసాద్‌, మురళీ మోహన్‌లను సత్కరించిన మెగాస్టార్‌ చిరంజీవి

పద్మశ్రీ అవార్డులకు ఎంపికైన రాజేందప్రసాద్‌, మురళీ మోహన్‌లను మెగాస్టార్‌ చిరంజీవి సత్కరించారు. ఆయనే స్వయంగా వారి ఇంటికి వెళ్లి శాలువా కప్పి, పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు. ఈ పురస్కారాలు తెలుగు సినిమాకు లభించిన ఈ జాతీయ గౌరవం ఒక మైలురాయిగా పేర్కొన్నారు. వారితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇది చిత్ర పరిశ్రమకు నిజంగా ఒక ఆనందకరమైన రోజు అని అభివర్ణించారు. ఈ సందర్భంగా పద్మ అవార్డు పొందినవారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

బ్రిటిష్ పాలనపై ‘రణబాలి’ ఉక్కుపాదం – విజయ్ దేవరకొండ

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ , ‘టాక్సీవాలా’ ఫేం రాహుల్ సంకృత్యాన్ కాంబోలో పీరియాడికల్ యాక్షన్ డ్రామా రాబోతోన్న సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు. దీంతో పాటే ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేయగా గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ మూవీకి పవర్ ఫుల్ టైటిల్ ‘రణబాలి’ని ఫిక్స్ చేశారు మేకర్స్. ‘ఇది స్వాతంత్ర్యానికి సంబంధించిన స్టోరీ కాదు. అంతకు ముందు ఉన్న చీకటి కోణం ఈ […]

బాలీవుడ్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన ప్ర‌కాశ్ రాజ్..

కేరళలో ‘కేరళ లిటరేచర్ ఫెస్టివల్’లో ప్రకాష్ రాజ్ హిందీ చిత్ర పరిశ్రమపై తీవ్ర స్థాయిలో స్పందించారు. బాలీవుడ్ తన మూలాలను క్రమంగా కోల్పోతుందని, కథల్లో ఉండాల్సిన ఆత్మను పక్కన పెట్టేసిందని ఆయన వ్యాఖ్యానించారు. బాలీవుడ్ సినిమాలను ‘మేడమ్ టుస్సాడ్స్’ మ్యూజియంలోని మైనపు విగ్రహాలతో పోల్చడం వాటిలో జీవం ఉండదన్న భావనను ఈ పోలిక ద్వారా స్పష్టంగా చెప్పారు.మల్టీప్లెక్స్ సంస్కృతి పెరిగిన తర్వాత హిందీ సినిమాలు కథల కంటే లగ్జరీ లుక్స్‌, భారీ ప్రమోషన్లు, ఖరీదైన రీల్స్‌, డబ్బు […]

అనిల్ రావిపూడికి మెగాస్టార్ గిఫ్ట్… చిరంజీవి రేంజ్‌కు తగ్గట్టు అదిరిపోయే కార్

మెగాస్టార్ చిరంజీవి ప్రయాణంలో అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ విజయాన్ని ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడికి చిరంజీవి అదిరిపోయే బహుమతి ఇచ్చారు. అల్ట్రా ప్రీమియర్ రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చారు. కారు నచ్చిందా?’ అని అడిగారు. అప్పుడు ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో మందు కొట్టడానికి ముందు చిరంజీవి చెప్పిన డైలాగ్ కాస్త మార్చి చెప్పారు అనిల్ రావిపూడి. ‘మెగా బహుమతి మహదానందం మనో ధైర్యం ధనాధన్’ అంటూ […]

థాంక్యూ మై దోస్త్.. మహేష్ బాబు కు ప్రియాంక చోప్రా ప్రత్యేక కృతజ్ఞతలు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంకపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘ది బ్లఫ్’ ట్రైలర్‌పై మహేష్ బాబు స్పందించారు. ‘ది బ్లఫ్’ ట్రైలర్ అద్భుతం, ప్రియాంక నటన రాజీపడనిది, అమోఘం అంటూ కొనియాడాడు సూపర్ స్టార్ మహేష్ బాబు… ప్రియాంక చోప్రా. వెంటనే మహేష్ పోస్ట్ కు స్పందించింది. మహేష్ బాబు ప్రశంసలకు ప్రేమగా స్పందిస్తూ.. ‘థాంక్యూ మై దోస్త్’ అంటూ రిప్లై ఇచ్చింది. .తన స్నేహాన్ని గుర్తుచేస్తూ మహేష్ కు ప్రత్యేకంగా […]

వాకింగ్ స్టిక్‌తో న‌డుస్తున్న హృతిక్ రోష‌న్.. టెన్ష‌న్ ప‌డుతున్న ఫ్యాన్స్

బాలీవుడ్‌లో సూపర్ హీరో హృతిక్ రోషన్ మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాడు. హృతిక్ రోష‌న్ తాజాగా వాకింగ్ స్టిక్‌తో న‌డుస్తూ కెమెరాల‌కి చిక్కాడు. ఈ మ‌ధ్యే బ‌ర్త్ డే పార్టీలో ఫిట్‌గా కనిపించిన హృతిక్ రోష‌న్ ఇలా చేతి క‌ర్ర‌ల‌తో న‌డుస్తూ క‌నిపించ‌డం ఫ్యాన్స్‌లో టెన్ష‌న్ పుట్టిస్తుంది. సాధార‌ణంగా న‌వ్వుతూ ఫొటోగ్రాఫ‌ర్స్‌ని ప‌ల‌క‌రించే హృతిక్ ఈ సారి మాత్రం సైలెంట్‌గా త‌న కారు వైపు వెళ్లాడు. ఆయ‌న న‌డిచే విధానం చూస్తుంటే మోకాళ్ల‌కి దెబ్బ‌లు బ‌లంగా త‌గిలిన‌ట్టు […]

‘రోజా’ నుంచి అన్నీ కాపీయేనా..ఏఆర్ రెహ్మాన్‌ని ఆడుకుంటున్న నెటిజన్లు..

నిన్నమొన్నటి దాకా రెహ్మాన్‌ని లెజెండ్‌లా అభిమానించి, ఆరాధించినవాళ్లే.. ఇప్పుడు ఆయన్ని తిడుతూ ట్రోల్ చేస్తున్నారు. ‘1989లో వచ్చిన యానీ స్వరపరిచిన ‘క్వైట్ మ్యాన్’ ట్యూన్‌, ‘రోజా’లోని సాంగ్ ట్యూన్ ఒకేలా ఉంటాయంటూ సాక్ష్యాలతో వినిపిస్తున్నారు.. ‘పొన్నియన్ సెల్వం’ మూవీలో ‘వీర రాజ వీర శూర’ సాంగ్ ట్యూన్‌ కూడా గుండెచా బ్రదర్స్ ఆలపించే ‘శివ సుత్తి’ మక్కీకి మక్కీ కాపీ చేశాడని ‘మా తుజే సలాం’ పాట,‘ముక్కాలా ముక్కాలా’ పాట కాపీ చేసిన ట్యూన్స్‌ని సాక్ష్యాలతో సహా […]

ఆస్కార్‌ నామినేషన్స్‌-2026.. ఏకంగా 16 కేటగిరిల్లో ‘సిన్నర్స్‌’..

సినీ ప్రపంచం ఎంతగానో ఎదురుచూస్తున్న 2026 ఆస్కార్ నామినేషన్లను అకాడమీ అధికారికంగా ప్రకటించింది. 2025లో విడుదలైన అత్యుత్తమ చిత్రాల మధ్య ఈసారి గట్టి పోటీ నెలకొంది. ఈ ఏడాది నామినేషన్లలో రేయాన్ కూగ్లర్ దర్శకత్వం వహించిన ‘సిన్నర్స్‌’ చిత్రం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఏకంగా 16 విభాగాల్లో నామినేషన్లు దక్కించుకుని, గతంలో ‘టైటానిక్’, ‘లా లా ల్యాండ్’ పేరిట ఉన్న 14 నామినేషన్ల రికార్డును బ్రేక్ చేసింది. ‘సిన్నర్స్‌’ తర్వాత ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రం […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON