కేరళలో ‘కేరళ లిటరేచర్ ఫెస్టివల్’లో ప్రకాష్ రాజ్ హిందీ చిత్ర పరిశ్రమపై తీవ్ర స్థాయిలో స్పందించారు. బాలీవుడ్ తన మూలాలను క్రమంగా కోల్పోతుందని, కథల్లో ఉండాల్సిన ఆత్మను పక్కన పెట్టేసిందని ఆయన వ్యాఖ్యానించారు.
బాలీవుడ్ సినిమాలను ‘మేడమ్ టుస్సాడ్స్’ మ్యూజియంలోని మైనపు విగ్రహాలతో పోల్చడం వాటిలో జీవం ఉండదన్న భావనను ఈ పోలిక ద్వారా స్పష్టంగా చెప్పారు.మల్టీప్లెక్స్ సంస్కృతి పెరిగిన తర్వాత హిందీ సినిమాలు కథల కంటే లగ్జరీ లుక్స్, భారీ ప్రమోషన్లు, ఖరీదైన రీల్స్, డబ్బు చుట్టూనే తిరుగుతున్నాయని ప్రకాష్ రాజ్ విమర్శించారు.

