loader

డాలర్‌తో రూపాయి చారిత్రక పతనం

భారత కరెన్సీ రూపాయి శుక్రవారం చారిత్రక పతనాన్ని నమోదు చేసింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఇంట్రాడే ట్రేడింగ్‌లో 94.85 స్థాయికి పడిపోయి కొత్త ఆల్ టైమ్ కనిష్ఠాన్ని తాకింది. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఈ పతనానికి ప్రధాన కారణాలుగా మారాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి రూపాయి సుమారు 0.9 శాతం నష్టంతో 94.81 వద్ద స్థిరపడింది. ఇది కూడా రూపాయి చరిత్రలోనే అత్యల్ప ముగింపు స్థాయి కావడం గమనార్హం.

భారీ లాభాలు: సెన్సెక్స్1372,& 400400 పాయింట్లు పైకి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ఇరాన్ పై దాడుల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఐదు రోజుల విరామం ప్రకటించడం స్టాక్ మార్కెట్కు ఊతమిచ్చింది.సెన్సెక్స్ ఓ దశలో 1700 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 23 వేల మార్కును అందుకుంది.బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ ఒక్కరోజులోనే రూ. 7 లక్షల కోట్లు పెరిగి రూ.423 లక్షల కోట్లకు చేరింది.

ఒక్క రోజులో లక్షల కోట్లు ఆవిరి.. స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం

పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులకు దారితీస్తున్నాయి అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. ఈ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన సూచీ అయిన సెన్సెక్స్ ఏకంగా 1,958.04 పాయింట్లు (2.63 శాతం) నష్టపోయి 72,574.92 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, నిఫ్టీ కూడా 629.65 పాయింట్లు (2.72 శాతం) క్షీణించి 22,484.85 వద్దకు చేరుకుంది. మన మార్కెట్ల కంటే […]

కేంద్రం కీలక నిర్ణయం.. కమర్షియల్ గ్యాస్ సరఫరా 20శాతం పెంపు

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రాలకు అదనంగా మరో 20శాతం కమర్షియల్ గ్యాస్ అందించనున్నట్లు ప్రకటించారు. ఈనెల 23వ తేదీ నుంచి అదనంగా 20 శాతం కమర్షియల్ గ్యాస్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల 10శాతం కమర్షియల్ గ్యాస్ సరఫరాను కేంద్రం పెంచిందని నీరజ్ మిట్టల్ స్పష్టం చేశారు. హోటల్స్, రెస్టారెంట్లు, దాబాలకు గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను సూచించారు.

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

తెలుగు వారి కొత్త ఏడాది ఉగాది పండుగ నాడు స్టాక్ మార్కెట్ తీవ్ర నిరాశకు గురిచేసింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల వల్ల దలాల్ స్ట్రీట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీనివల్ల కేవలం ఒక్క రోజులోనే ఇన్వెస్టర్లు రూ. 12 లక్షల కోట్ల వరకు నష్టపోయారు. గ్యాస్ ప్లాంట్లపై దాడులు జరుగుతాయనే ఆందోళనతో గ్లోబల్ మార్కెట్లు వణికిపోయాయి. అమెరికా ఫ్యూచర్స్ కూడా నష్టాల్లో ఉండటంతో ఆ ప్రభావం భారతీయ సూచీలపై పడింది. ఆటోమొబైల్ మరియు బ్యాంకింగ్ షేర్లు భారీగా […]

స్టాక్ మార్కెట్ భారీ పతనం.. సెన్సెక్స్ 1,300 పాయింట్లు నష్టం.. దిగజారిన రూపాయి

భారత మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 1360 పాయింట్లు నష్టపోయింది. దీంతో 75,000 పాయింట్ల దిగువకు సెన్సెక్స్ పడిపోయింది. నిఫ్టీ 50 కూడా 400 పాయింట్లు నష్టపోయింది. 23,144 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్, నిఫ్టీ 50 ఇండెక్స్ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద ఏకంగా ఈ ఒక్కరోజే రూ.9 లక్షల కోట్లు నష్టపోయింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు 100 డాలర్లకు పైగా పెరగడం మార్కెట్‌పై ప్రభావం చూపిస్తోంది. బ్యాంకింగ్ షేర్లు భారీ […]

వంట గ్యాస్​ కొరత భయాలు- ఇండక్షన్ స్టవ్​లన్నీ సేల్- ఆన్​లైన్​లో ‘అవుట్ ఆఫ్ స్టాక్’

ఎల్​పీజీ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడవచ్చనే ఆందోళనలు నేపథ్యంలోనే ప్రత్యామ్నాయాల కోసం ముఖ్యంగా ఇండక్షన్ స్టవ్​ల కోసం విపరీతంగా ఆర్డర్లు పెడుతున్నారు. దీంతో అవి హాట్​ కేక్​ల్లా అమ్ముడపోతున్నాయి. దీంతో క్విక్​- కామర్స్​ సైట్లలో చూస్తుంటే చాలా వరకు ‘అవుట్ ఆఫ్ స్టాక్​’ అనే బ్యాడ్జ్​లు కనిపిస్తున్నాయి. అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​ లాంటి అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. తమకు ఒకేసారి భారీ మొత్తంలో ఇండక్షన్​ స్టవ్​ల గురించి ఆర్డర్లు వస్తున్నాయని పేర్కొన్నాయి.

ప్రతి సోమవారం హోటళ్లకు ‘వీక్లీ హాలిడే’

గ్యాస్ కొరత కారణంగా రాష్ట్రంలోని స్టార్ హోటళ్ల నుంచి జొమాటొ, స్విగ్గీ ఆన్లైన్ ఆర్డర్లను త్వరలో నిలిపివేస్తున్నట్టు హోటళ్ల అసోసియేషన్ జేఏసీ ప్రకటించింది. ముఖ్యంగా ప్రతి సోమవారం రెస్టారెంట్లను పూర్తిగా మూసివేసి ‘వీక్లీ హాలిడే’గా ప్రకటిస్తామన్నారు. కర్ణాటక తరహాలో ఏపీలోనూ కొన్ని హోటల్స్ కేవలం టీ, కాఫీ మాత్రమే విక్ర యించే పరిస్థితి వస్తుందన్నారు. రాత్రి 10 గంటల వర కే రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లను నడిపేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.

మళ్లీ ముకేశే నంబర్‌ వన్

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ హవా కొనసాగుతున్నది. 2026 సంవత్సరానికిగాను అంతర్జాతీయ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌ విడుదల చేసిన దేశీయ శ్రీమంతుల జాబితాలో 99.6 బిలియన్‌ డాలర్ల వ్యక్తిగత సంపదతో రిలయన్స్‌ అధినేత తన తొలిస్థానాన్ని పదిలపరుచకున్నట్టు వెల్లడించింది.రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 12 శాతం బలపడటంతో ఆయన వ్యక్తిగత సంపద పెరగడానికి దోహదం చేసిందని పేర్కొంది. అయినప్పటికీ ఆయన సంపద 100 బిలియన్‌ డాలర్లకు కొద్ది దూరంలో నిలిచిపోయారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON