రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ హవా కొనసాగుతున్నది. 2026 సంవత్సరానికిగాను అంతర్జాతీయ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసిన దేశీయ శ్రీమంతుల జాబితాలో 99.6 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదతో రిలయన్స్ అధినేత తన తొలిస్థానాన్ని పదిలపరుచకున్నట్టు వెల్లడించింది.రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 12 శాతం బలపడటంతో ఆయన వ్యక్తిగత సంపద పెరగడానికి దోహదం చేసిందని పేర్కొంది. అయినప్పటికీ ఆయన సంపద 100 బిలియన్ డాలర్లకు కొద్ది దూరంలో నిలిచిపోయారు.

