భారత మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 1360 పాయింట్లు నష్టపోయింది. దీంతో 75,000 పాయింట్ల దిగువకు సెన్సెక్స్ పడిపోయింది. నిఫ్టీ 50 కూడా 400 పాయింట్లు నష్టపోయింది. 23,144 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్, నిఫ్టీ 50 ఇండెక్స్ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద ఏకంగా ఈ ఒక్కరోజే రూ.9 లక్షల కోట్లు నష్టపోయింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు 100 డాలర్లకు పైగా పెరగడం మార్కెట్‌పై ప్రభావం చూపిస్తోంది. బ్యాంకింగ్ షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి.

