చట్టవిరుద్ధంగా వాకీ-టాకీల విక్రయం.. 13 ఈ-కామర్స్ సైట్స్‌కు రూ.10 లక్షల చొప్పున జరిమానా
చట్టవిరుద్ధంగా వాకీ-టాకీలు (Walkie-Talkie) విక్రయిస్తున్న ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ (సీసీపీఏ) స్వయంగా చర్యలు చేపట్టింది. 13 ప్రముఖ ఈ-కామర్స్ సైట్స్‌కు రూ.10 లక్షల చొప్పున జరిమానా విధించింది. చిమియా, జియోమార్ట్, టాక్ ప్రో, మీషో, మాస్క్‌మ్యాన్ టాయ్స్, ట్రేడ్ ఇండియా, ఆంత్రిక్ష్ టెక్నాలజీస్, వర్దాన్‌మార్ట్, ఇండియామార్ట్, మెటా ప్లాట్‌ఫామ్‌లు ఇంక్. (ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్), ఫ్లిప్‌కార్ట్, కృష్ణ మార్ట్, అమెజాన్ సంస్థలు 16,970కు పైగా చట్టవిరుద్ధంగా వాకీ-టాకీలు అమ్మినట్లు సీసీపీఏ గుర్తించింది.

