యూకేను వీడిన వీసాదారుల్లో భారతీయులు అగ్రస్థానంలో నిలిచారు. ‘ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్’ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. 2025 జులై- 2026 జూన్ మధ్యకాలంలో 85 వేల మంది భారతీయులు యూకేను వీడారు. ఇందులో 55 వేల మంది విద్యార్థులు (స్టడీ వీసాలు), 28 వేల మంది ఉద్యోగులు (వర్క్ వీసాలు), రెండు వేలమంది ఇతర వీసాల వారు ఉన్నారు. 51 వేల మందితో చైనీయులు రెండో స్థానంలో నిలిచారు. కొత్తగా యూకేకి వెళ్తున్న వారిలోనూ భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు.