నాగర్ కర్నూల్ జిల్లా మద్దిమడుగులో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ దేవాలయానికి భూమి పూజ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతపురంలో జన్మించిన సంత్ సేవాలాల్ మహారాజ్ సమాజానికి మంచి సన్మార్గాన్ని చూపారని సీఎం పేర్కొన్నారు. మద్యం, మాంసానికి దూరంగా ఉండాలని సూచించి, సమాజానికి ఆదర్శంగా నిలిచిన ఆయన లంబాడాలందరికీ ఆరాధ్య దైవమని కొనియాడారు. ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి, దాని చైర్మన్గా లంబాడా సోదరుడిని నియమిస్తామన్నారు. రాజకీయాల్లో లంబాడాలకు రావాల్సిన కోటాను దిల్లీకి వెళ్లి సాధించి తీసుకువస్తామన్నారు.

