ప్యూర్టోరికోకు చెందిన జెన్నిఫర్ బారెటో విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకున్నారు. అయితే ఆమె విజయంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోటీల్లో న్యాయనిర్ణేతల నిర్ణయం సరిగ్గా లేదని, విజేతను ముందుగానే నిర్ణయించారేమోనని కొందరు నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఫిలిప్పీన్స్ తరఫున పాల్గొన్న బీ మిల్లన్-విండోర్స్కీ సమాధానాలు, ప్రదర్శన బాగున్నాయని, ఆమెకే కిరీటం దక్కాల్సిందని పలువురు అభిప్రాయపడుతున్నారు జెన్నిఫర్ మాత్రం తలపై ప్రత్యేకమైన అలంకరణ ధరించి, హెడ్ఫోన్స్ కూడా పెట్టుకున్నారు. దీంతో ఆమెకు ఇతరుల సమాధానాలు వినిపించే అవకాశం ఉందంటూ కొందరు కామెంట్లు చేశారు.