తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యాశాఖ ఉద్యోగుల సర్వీసు వ్యవహారాలను డిజిటలైజ్ చేసే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇకపై ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ సెలవుల దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. అధికారులు కూడా వాటిని డిజిటల్ విధానంలో పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుంది. కేవలం సెలవులకే పరిమితం కాకుండా ఉద్యోగుల ఇతర సర్వీసు వ్యవహారాలను కూడా ఈ పోర్టల్ ద్వారా నిర్వహించనున్నారు. ఇందులో వార్షిక ఇంక్రిమెంట్లు, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPGF), ఈ-పెన్షన్ వంటి అంశాలు ఉన్నాయి.