భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వచ్చే నెల అంటే డిసెంబర్ 16న ఆమె ఢాకాకు తిరిగి వెళ్లనున్నట్లు ఆమె అధికార ప్రతినిధి సయ్యద్ మొజామెల్ అలీ ‘రాయిటర్స్’ వార్తా సంస్థకు వెల్లడించారు. 1971లో సరిగ్గా ఇదే రోజున పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ విజయం సాధించి స్వతంత్ర దేశంగా అవతరించింది. బంగ్లాదేశ్ ప్రజలు ఎంతో గర్వంగా జరుపుకునే ఆ చారిత్రాత్మక ‘విజయ దినోత్సవం’ (Victory Day) నాడే హసీనా తిరిగి అడుగుపెట్టాలని నిర్ణయించుకోవడం ఆ దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.