కాక్రోచ్ జనతాపార్టీ (CJP) సహ కన్వీనర్ సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు చేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనేందుకు లండన్ వెళ్లాల్సి ఉండగా, దిల్లీ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు తనను అడ్డుకున్నారని వెల్లడించారు. సోమవారం ఎక్స్ వేదికగా వరుస పోస్టులు పెట్టారు. తెల్లవారుజామున 1 గంటకు బయలుదేరాల్సిన విమానం ఎక్కేందుకు సిద్ధమైన సమయంలో ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు.