ఖమ్మం జిల్లా వైరా సమీపంలోని గ్రీన్ఫీల్డ్ హైవే ఎగ్జిట్ వద్ద మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ కు చెందిన కోటా కిషోర్ రెడ్డి, ఆయన భార్య లావణ్య, కుమారుడు ప్రణీత్ ఆంధ్రప్రదేశ్ లోని అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్లారు. దైవదర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో భాగంగా వైరా సమీపంలోని గ్రీన్ఫీల్డ్ హైవే ఎగ్జిట్ వద్దకు రాగానే, అక్కడ ఆగి ఉన్న లారీని వీరి కారు అదుపుతప్పి బలంగా ఢీకొట్టింది.