తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక సందడి మిన్నంటింది. వేకువజాము నుంచే భక్తులు భక్తిశ్రద్ధలతో పవిత్ర నదులు, సముద్ర తీరాలకు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు.పుణ్యస్నానాల అనంతరం దైవ దర్శనం కోసం భక్తులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శివాలయాలకు పెద్ద ఎత్తున పోటెత్తారు.ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, కీసరగుట్ట, కోటప్పకొండ, వేములవాడ, పంచారామ క్షేత్రాలు భక్తుల ‘హర హర మహాదేవ’ నామస్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఊరూవాడా దీపాల కాంతులతో, భక్తి గీతాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

