తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరల పంపిణీకి సిద్ధమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల మంది మహిళలకు, పట్టణల్లో 35 లక్షల మంది మహిళలకు ఈ చీరలను పంపిణీ చేయనుంది. గతంలో చీరలు పాల పిట్ట కలర్లో ఉండగా, ఈసారి ఎరుపు జరీ అంచుతో కూడిన చిలక పచ్చ రంగును ఎంపిక చేశారు. ఈ 6.30 మీటర్ల పొడవుతో 95 లక్షల పాలిస్టర్ చీరలు, 9 మీటర్ల పొడవుతో 5 లక్షల పాలీకాటన్ చీరలను పంపిణీ చేయనున్నారు.

