నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్‌గా అభ్యర్థిగా జనసేన రెబల్ అభ్యర్థి శిరీషను అధిష్ఠానం ప్రకటించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. శిరీష రెబల్‌గా పోటీ చేయడం, సోమవారం ఎన్నిక వేళ నిరసనకు దిగి మున్సిపల్ కార్యాలయం వద్ద బైఠాయించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.శిరీష ఎన్నికను వ్యతిరేకిస్తూ ఇద్దరు జనసేన అభ్యర్థులు, 12 మంది టీడీపీ సభ్యులు, ఓ బీజేపీ సభ్యుడు గైర్హాజరయ్యారు. దీంతో 17 మంది కౌన్సిలర్ల మద్దతుతో వైస్ ఛైర్‌పర్సన్‌గా శిరీష ఎన్నికయ్యారు.

