పాకిస్థాన్ వెబ్ సిరీస్ ‘జో బచాయ్ హై సంగ్ సమైత్ లో’ భారత్ లో స్ట్రీమింగ్ కాకుండా నిషేధించాలని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్, హనియా ఆమిర్, సమన్ అన్సారీ కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ డిసెంబరు 4వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ Netflix లో స్ట్రీమింగ్ కు రానుంది. పుల్వామా దాడి తర్వాత పాకిస్థాన్ నటీనటులు, కంటెంట్ భారత్ లో స్ట్రీమింగ్ కాకుండా నిలిపివేయాలని అన్ని ఓటీటీ వేదికలను ఆదేశించింది.

