ఎవరేం చేస్తున్నారో తమకు అన్నీ తెలుసని సీఎం రేవంత్ రెడ్డి అంసతృప్తి నేతలను ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు. ముందు ఏం చేస్తున్నారో, వెనుక ఏం మాట్లాడుతున్నారో తమ వద్ద డేటా ఉందని తెలిపారు. ఢిల్లీలో పరిచయాలుంటే, గాంధీ భవన్ చుట్టూ తిరిగితే పదవులు రావని తేల్చి చెప్పారు. క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేస్తేనే పదవులు వస్తాయన్నారు. వ్యూహాలు, ఎత్తుగడలు మాకు వదిలేయాలన్నారు. రాజకీయాల్లో బ్యాలెన్స్ షీట్ అయిదేళ్లకోసారి మాత్రమే వస్తుందని.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు.