పల్నాడు వాటర్ గ్రిడ్ పథకం 2022లో అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వాల హయాంలోనే ప్రారంభమైందని తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద రూ.1,580 కోట్లకు సంబంధించిన జీవో కూడా 2022లోనే వచ్చిందని ఆయన పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రులుగా సేవలు అందించిన ఎన్టీఆర్, వైఎస్ఆర్ హయాంలో ప్రారంభమైన పలు కార్యక్రమాలను నేటికీ కొనసాగిస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు.