శబరిమల మండల-మకరవిళక్కు ఉత్సవాల సందర్భంగా అయ్యప్ప భక్తులకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) శుభవార్త అందించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నవంబర్ 30 వరకు ప్రతిరోజూ అదనంగా 5 వేల వర్చువల్ క్యూ టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో రోజువారీ దర్శన సామర్థ్యం 85 వేలకు చేరింది. అదనంగా కేటాయించిన వర్చువల్ క్యూ టికెట్లను ప్రతిరోజూ రాత్రి 10 గంటలకు అధికారిక పోర్టల్లో విడుదల చేస్తున్నారు. భక్తులు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే సమయంలో ఆధార్ ఓటీపీ ధ్రువీకరణ తప్పనిసరిగా పూర్తి చేయాలి.