ఆంధ్రప్రదేశ్ శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నేతలు లోక్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడిందని ఆరోపిస్తూ, తక్షణమే కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ, పోలీసులను అడ్డం పెట్టుకుని నామినేషన్లను అడ్డుకున్నారని, తమ బాధను గవర్నర్‌కు విన్నవించుకున్నామని తెలిపారు. దమ్ముంటే ఎన్నికలను రద్దు చేసి మళ్లీ ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని సవాల్ విసిరారు.