అస్సాంలోని లఖింపూర్‌లో తీవ్రంగా గాయపడిన ఏడు వారాల గున్న ఏనుగు ‘రాజా’ ప్రాణాలు కాపాడేందుకు అనంత్ అంబానీ, వంతారా (Vantara) బృందం ప్రత్యేక ఎయిర్ లిఫ్ట్ ఏర్పాటు చేసింది. పుట్టుకతోనే తొడ ఎముక విరిగి, తల్లి పాల రోగనిరోధక శక్తి లేక ఇబ్బంది పడుతున్న ఈ గున్న ఏనుగును మెరుగైన ఐసీయూ చికిత్స కోసం గుజరాత్ జామ్ నగర్ లోని వంతారా ఆసుపత్రికి తరలించారు. ఈ సహాయంపై అస్సాం ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.