హిందువుల భద్రతను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా ప్రతి హిందువు ఇంట్లో లైసెన్స్ ఉన్న తుపాకులు ఉండాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ముస్లింల జనాభా పెరిగితే హిందువులకు రక్షణ ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ‘హమ్ దో హమారే దో’ (ఇద్దరు పిల్లల నిబంధన) చట్టాన్ని తీసుకురావాలని, లేనిపక్షంలో ప్రతి హిందూ కుటుంబం ఆత్మరక్షణ కోసం లైసెన్స్డ్ గన్స్ కలిగి ఉండాల్సిన అవసరం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు.