తండ్రి కూలీ పనులు చేస్తూ, తల్లి టైలరింగ్ చేస్తూ వచ్చిన సంపాదనలోనే పిల్లల చదువులకు ప్రాధాన్యం ఇచ్చారు. కూతురు వరలక్ష్మిని గుంటూరులోని వీవీఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్లో చేర్పించారు. కష్టాన్ని వరలక్ష్మీ అర్థం చేసుకుంది. చదువుపై దృష్టి పెట్టింది. క్లాస్లో మంచి మార్కులు సాధిస్తూ ముందుకు సాగింది. ఎంపిక ప్రక్రియలో తన ప్రతిభను నిరూపించుకుంది. ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీ అమెజాన్లో ఉద్యోగం సంపాదించింది. అది కూడా ఏడాదికి రూ.46 లక్షల ప్యాకేజీతో!