ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిని గెలిపించిన రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో మనం 94 శాతం స్ట్రైక్ రేట్ సాధిస్తే, ఇప్పుడు పరిషత్ (MPTC, ZPTC) ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్ విజయం సాధించామన్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత పరిషత్ ఎన్నికల్లోనూ ప్రజలు తమపై నమ్మకంతో అద్భుత ఫలితాలు ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు. ఈ స్థానిక ఎన్నికల ఫలితాలను రెండున్నరేళ్ల కూటమి సర్కార్ పాలనకు ప్రజలిచ్చిన తీర్పుగా భావిస్తామన్నారు.