అల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థల నుంచి విమానయాన రంగానికి ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో అమెరికా భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. విమానాలు, విమానాశ్రయాలు, ఎయిర్ కార్గో కార్యకలాపాలపై దాడులు చేయాలంటూ ఉగ్రవాద అనుకూల వర్గాలు సందేశాలు ప్రచారం చేస్తున్నట్లు గుర్తించాయి. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్‌బీఐ, హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS), రవాణా భద్రతా సంస్థ (TSA) సంయుక్తంగా హెచ్చరిక జారీ చేశాయి.