భాగ్యనగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీపై ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ తాకిడి ఊహించనంతగా పెరిగిపోయిందని, గమ్యస్థానాలకు చేరుకోవడం సవాలుగా మారుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. తాజాగా అమీర్‌పేటలోని ఏఏఏ (AAA) సినిమాస్‌లో జరిగిన తన తదుపరి చిత్రం ‘మైసా’ (Mysaa)లోని ‘ఒసేయ్ రాములమ్మ’ పాట విడుదల వేడుకకు రష్మిక హాజరయ్యారు. అయితే, ఈ కార్యక్రమానికి ఆమె కాస్త ఆలస్యంగా రావడంతో, అందుకు నగరంలోని విపరీతమైన ట్రాఫికే ప్రధాన కారణమని వేదికపై స్పష్టం చేశారు.