న్యూఢిల్లీలో నిర్వహించిన తొలి షాంఘై సహకార సంస్థ (SCO) నాగరికతల సంభాషణ వేదిక (Civilisational Dialogue Forum) ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని చారిత్రాత్మక పురానా ఖిలా (Purana Qila) లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనను ప్రధాని సందర్శించి, విశేషాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ దేశాల మధ్య సాంస్కృతిక, నాగరికత సంబంధాలను బలోపేతం చేసే దిశగా ఈ సదస్సు కీలకంగా నిలవనుంది.