మ్యాచో స్టార్ గోపీచంద్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతుంది. త్వరలో తెరకెక్కనున్న ఓ తమిళ సినిమాలో గోపీచంద్ విలన్ పాత్రలో నటించబోతున్నాడంటూ ఈ వార్త జోరుగా వినిపిస్తోంది. కానీ, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని గోపీచంద్ టీమ్ అధికారికంగా క్లారిటీ ఇచ్చింది. అవి పూర్తిగా అవాస్తవమని గోపీచంద్ టీమ్ స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు, తప్పుదోవ పట్టించే కథనాలను ప్రచారం చేయవద్దని మీడియా మరియు సోషల్ మీడియా హ్యాండిల్స్‌కు గోపీచంద్ టీమ్ విజ్ఞప్తి చేసింది.