టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ కు ఒంగోలు కోర్టు ఏడాదిపాటు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. అంతేకాదు, రూ.95 లక్షల జరిమానా కూడా విధించింది బండ్ల గణేష్ ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో.. తనను మోసం చేశాడని ఆరోపిస్తూ బాధితుడు ఒంగోలు కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో విచారణ చేపట్టిన కోర్టు.. బండ్ల గణేష్ కు ఏడాది జైలుశిక్ష, జరిమానా విధించింది.ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు బండ్ల గణేష్ కు న్యాయస్థానం నెల రోజుల గడువు ఇచ్చింది.