మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నయాన్ ఇన్ఫ్రా అపార్ట్మెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నివాసితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నాలుగో అంతస్తులో ఎదురెదురుగా ఉన్న రెండు ఫ్లాట్లలో గ్యాస్ సిలిండర్లతో పాటు ఏసీ కంప్రెషర్లు పేలినట్లు సమాచారం. దీంతో మంటలు భారీగా వ్యాపించాయి. ప్రమాదం సమయంలో అపార్ట్మెంట్లో ఉన్నవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. ముఖ్యంగా చిన్నపిల్లలను తీసుకుని కుటుంబ సభ్యులు హడావుడిగా కిందకు చేరుకున్నారు. పేలుళ్ల శబ్దాలతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

