వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలవుతున్న వేళ పోలీసులు అప్రమత్తమయ్యారు. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా వైఎస్ఆర్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి పులివెందుల పోలీసులు నోటీసులు జారీ చేశారు. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సమయంలో రాజకీయ ఉద్రిక్తతలు, ఘర్షణలు తలెత్తకుండా శాంతిభద్రతలను కాపాడేందుకు ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. సమాచారాన్ని ఆయనకు చేరవేసేందుకు నోటీసు ప్రతిని వాట్సప్ ద్వారా కూడా పంపించారు