కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ బ్లో అవుట్లో ONGC అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారు. నాలుగు ఫైర్ ఇంజన్లతో బ్లో అవుట్‌ను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది ప్రస్తుతం గ్యాస్ లీక్ తీవ్రత ఉదయం కంటే తగ్గిందని అధికారులు తెలిపారు. గ్యాస్ కట్టడికి గన్నవరం కాలువ ద్వారా 600 క్యూసెక్కుల నీరు విడుదల చేసారు. గ్యాస్ బావికి వెల్ క్యాప్ అమర్చే క్రమంలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. కొన్ని గంటల్లోనే లీకేజీని అరికడతామని ఓఎన్జీసీ అధికారులు చెబుతున్నారని వెల్లడించారు.