కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు.. కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాయలసీమ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టుతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఏపీలో వరుస తుపానులు, ఎల్‌నినో పరిస్థితుల వల్ల జరిగిన నష్టం గురించీ కేంద్ర మంత్రి వద్ద ప్రస్తావించారు. అలాగే, ఎల్‌నినో కారణంగా తలెత్తిన సమస్యలనూ వివరించారు.