తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ధ్వజమెత్తారు. మేనిఫెస్టోకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ లో విమర్శలు చేశారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్తో సమానమని చెప్పిన కాంగ్రెస్ నేతలు.. అధికారంలోకి వచ్చిన తరువాత హామీలను పట్టించుకోలేదన్నారు. గొప్పగా ప్రచారం చేసుకున్న అభయహస్తం పథకం శూన్య హస్తంగా మారిందని విమర్శించారు. గాంధీ భవన్ వేదికగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను ఎందుకు నిలబెట్టుకోలదని ప్రశ్నించారు.