ఒంటెత్తు పోకడలతో ఇంటర్ బోర్డును రద్దు చేస్తామంటే ఒప్పుకోమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై మేధావులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లితండ్రులు, విద్యావేత్తలతో చర్చలు జరపాలని తెలిపారు. డ్రాప్ అవుట్స్ పేరుతో ఇంటర్ బోర్డును రద్దు చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్న లెక్కలు తప్పని చెప్పుకొచ్చారు. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ను ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్గా భావించొద్దని హితవుపలికారు. మార్పు జరగాలంటే 3 నుంచి 10 ఏళ్ల సమయం ప్రాసెస్ జరగాలని తెలిపారు.