అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో తాడివారిమెరక వద్ద ఓఎన్జీసీ అధికారులు రీడ్రిల్లింగ్ పనులు చేపట్టారు. ఈ పాయింట్ నుంచే అకస్మాత్తుగా సీఎన్జీ గ్యాస్ భారీగా లీకైంది. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా గ్యాస్ వాసన వ్యాపించింది. గ్యాస్ బ్లోఅవుట్ సమాచారం అందుకున్న వెంటనే ఓఎన్జీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. హుటాహుటిన క్షేత్రస్థాయికి చేరుకున్నారు. గ్యాస్ లీక్‌ను అరికట్టేందుకు అత్యవసర చర్యలు చేపట్టారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా
ముందు జాగ్రత్తగా ఘటనా స్థలం పరిసరాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.