ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రిషికేశ్-బద్రీనాథ్ జాతీయ రహదారిపై గూలర్ బజార్ సమీపంలో ఓ బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి దాదాపు 100 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పోలీసులు, సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు.