అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ‘డర్టీ బాంబ్’ పేల్చేందుకు ఇరాన్ ప్రణాళిక రచిస్తున్నట్లు అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయని CNN తన కథనంలో వెల్లడించింది. ఈ దాడికి సంబంధించి కొన్ని ప్రాంతాలు, ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయని పేర్కొంది. అమెరికా భద్రతా వ్యవస్థలు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. దేశంలోని కీలక ప్రాంతాల భద్రత, ప్రభుత్వ ప్రతినిధుల రక్షణ విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు కథనం పేర్కొంది. అయితే ఈ వార్తపై అధికారికంగా వెలువడిన వివరాల గురించి స్పష్టత రావాల్సి ఉంది.