బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపాను ప్రభావంతో ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ జిల్లాలకు ‘ఆరెంజ్’ హెచ్చరికలు జారీ చేసింది. 21న జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.