ఏపీలో రెండో దశ మున్సిపల్ ఎన్నికలకు మేయర్, చైర్మన్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదివారం ఖరారు చేశారు. శ్రీకాకుళం కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా డాక్టర్ దానేటి రాధారాణి, కాకినాడ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా ఆకుల భవానీని ఎంపిక చేశారు. అలాగే రాజాం మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా బనిశెట్టి సౌజన్య లత, భీమవరం మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ చుండూరి మల్లేశ్వరి, తాడేపల్లి గూడెం మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా పాలూరు వెంకటేశ్వరరావును ఖరారు చేశారు.