మహారాష్ట్రలో ప్రతిపాదిత యూనిఫాం సివిల్ కోడ్ (UCC)పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇస్లాంలో నికాహ్ అనేది కేవలం ఒక సివిల్ ఒప్పందం మాత్రమేనని, జన్మజన్మల బంధం కాదని ఆయన పేర్కొన్నారు. ముస్లింలు తమ మతపరమైన ఆచారాలు, వ్యక్తిగత చట్టాలను పాటించే స్వేచ్ఛను కొనసాగించాలని డిమాండ్ చేశారు.