ెలంగాణ కేంద్రంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయాలకు సిద్దం అయ్యారు. ఢిల్లీ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో జరిగే భారత్ సమ్మిట్‌కు రావాలని ఆయనను ఆహ్వానించారు. మంత్రులు, ఎంపీల మధ్య విభేదాలు, ఢిల్లీలో జరిగిన పరిణామాలపై ఏఐసీసీ అగ్రనేతతో సమావేశంలో చర్చ జరగలేదన్నారు. ఈ అంశాలను పార్టీ ఇన్ఛార్జ్, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చూసుకుంటారని వెల్లడించారు. నవంబర్ చివరినాటికి తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తవుతుందని స్పష్టత ఇచ్చారు.