ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. వలేటివారిపాలెం మండలం చుండి సమీపంలో సోమవారం రాత్రి 1.30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కడప నుంచి విజయవాడకు వెళ్తున్న బస్సు ముందు టైర్ పగిలి మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్.. బస్సును రోడ్డు పక్కన నిలిపి ప్రయాణికులను కిందికి దించారు. ప్రమాదం జరిగిన సమయంలో అందులో 33 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా కిందికి దిగిన తర్వాత బస్సు పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు.