ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఓ అలర్ట్. రాష్ట్రంలో ఉద్యోగుల వేతన సవరణలపై 12వ పీఆర్సీ కమిషన్ అధ్యయనం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీఆర్సీ అధ్యయనంపై ప్రభావం పడకుండా పలు రెగ్యులర్ పనులకు బ్రేక్ వేసింది. ఇందులో కొత్త పోస్టుల సృష్టి, హోదాల మార్పులు, ఉన్న పోస్టుల అప్ గ్రేడ్ ఇలా పలు అంశాలున్నాయి. పీఆర్సీ అమల్లోకి వచ్చే వరకూ వీటిని చేపట్టకుండా ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు ఆర్దిక శాఖ సర్కులర్ జారీ చేసింది.