తెలంగాణ రాష్ట్రంలో జనగణనకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ గెజిట్ కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. రాష్ట్రంలో జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు జనగణన చేయనున్నారు. మార్చి 1 నుంచి 5 వరకు రివిజనల్ రౌండ్ ఉంటుంది.జనవరి 10 నుంచి 24 వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ కు అవకాశం కల్పించనున్నారు. ఇక గతంలో మొదటి దశలో భాగంగా ఇళ్ల గణన.. ఇప్పుడు రెండో దశ జనాభా లెక్కల సేకరణను ప్రభుత్వం చేపట్టనుంది.

